23, ఫిబ్రవరి 2014, ఆదివారం

బావయామి గోపాలబాలం

వెదురును అయినా కాకపోతిని ....... నీ చేతిలో వేణువై శాశ్వతంగా నిలిచిపోతిని
నువ్వు పలికే రాగాల్లో ఒక రాగమైన కాకపోతిని నీ పలుకులో నిలిచే భాగ్యం కలిగేది
నీ నామాలలో ఒక నామమైన కాకపోతిని నీ నుదిటిపై శాశ్వతంగా ఉండాటానికి
నెమలి పింఛమైన కాకపోతిని నీ శిరస్సున అలంకారముగా ఉండే భాగ్యం కలిగేది
నీ భక్తులలో ఒకరిగా నిరంతరం నిన్నే ధ్యానిస్తున్నా నీ మదిలో నాకు స్థానం కల్పించు స్వామీ
శాశ్వత ప్రేమాభిమాలను నాలో నిలుపు తండ్రి ఏమి ఆశించి నీ భక్తురాలిగా మారలేదు
నిష్కల్మషమైన మనసుతో నిన్నే అరాదిస్తున్నా నిరంతరం నీ నామమే జపిస్తూ ..... నిన్నే కొలుస్తూ .....
నీ దర్శన భాగ్యం కోసం ఎదురుచూస్తూ కనులలో నీ రూపాన్ని నిలుపుకుని -లక్ష్మి శర్మ
================== త్వయి మయి సర్వత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః | భవ సమచిత్తః సర్వత్ర త్వం వాఞ్ఛస్యచిరాద్-యది విష్ణుత్వమ్ ================== అంతటా ఆయనే!! తల్లీ ఆయనే.. తండ్రీ ఆయనే.. గురువు ఆయనే.. దైవమూ ఆయనే.. నా.. అని స్వార్థము తో నేను అనే పిలవబడే నేను లో ఉండేది ఆయనే.. నీ .. అని పరాయతనము తో పిలువబడే నువ్వు లో ఉండేది ఆయనే.. సర్వ జీవులలో నిక్షిప్తమయ్యి ఉన్నది ఆయనే.. అంతయూ మన కుటుంబమే కదా!! అని కనుక్కోని .. గుర్తించి .. సర్వం విష్ణుమయం అని అనుకుంటే మనమందరమూ ఎల్లప్పుడు సంతోషము గా ఉండవచ్చు కదా !!! --- శ్రీ ఆదిశంకరచార్యులు
శ్రీ || నీ దివ్య నేత్రాలు ||

ప్రభూ!
నీ దివ్యచక్షువులను దర్శించాక,
ఇక యే చంచలనేత్రాలను
చూడ మనసగుటలేదు...

సుందరనయనాలెన్నో
చూసానింతవరకు,
వాటిలోనే మూర్ఖంగా వెతుకాను
అందాన్ని యింతవరకు...

నీ నేత్రాలలోని
విశ్వజనీనమైన వాత్సల్యం
అవ్యాజమైన ప్రేమ
మలయపు చల్లదనం
నేడు మనో నేత్రానికి గొచరమౌతున్నయి

ఒకకంటితో
సూర్యుని ధవళ కాంతులను శాసిస్తూ,
వేరొక కంటితో
ఈ జగతికి
వేయి పున్నముల వెలుగునిస్తున్నావు.

నీ నయనాలు
జలపుష్పాలను తలపిస్తూ
నీరజ దళాలంత
నిశ్చలంగా ఉన్నాయి.
చలాచలానికి సాక్షిగా...

ఆ చూపులచల్లదనం
నాపై ఎపుడూ ప్రసరించనీ ...
ఆ నేత్రద్వయం
చూపే వెలుగులో నీ సన్నిధి చేరనీ.
నీ లోనే నా విశ్వం నిండి ఉన్నది 
నీ లోనే నన్ను నేను నిలుపు కున్నది ....
ఎక్కడున్నా మనసు నీతోనే ముడి వేసుకున్నాను ..
ఎన్నడో నన్ను నేను నీకు సమర్పించు కున్నాను..
నా ఆత్మలో నీవే నిలిచి పొయావు... 
నీ రాక కోసం దారి కాచి వేచి ఉన్నాను కృష్ణా
రాధా రాణి

శ్రీహరి సేవకు యోగ్యమైన పూజా పుష్పాలు ?
..........................................................
శ్లో:- అహింసా ప్రథమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః 
సర్వ భూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః 
శాంతి:పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తధైవచ 

సత్యమష్ట విధం పుష్పం విష్ణో:ప్రీతికరం భవేత్ .
భావము:-
*అహింస ఇంద్రియ నిగ్రహము సర్వ భూత దయ ఓర్పు శాంతి పరమాత్మకై తపించుట పరమాత్మ
ధ్యానము సత్యనిరతి అనే ఎనిమిది విధాలైన పుష్పాలతో శ్రీహరిని ఆరాధిస్తే అనుగ్రహిస్తారు.
ప్రేమ కు నిలయమైన నీ హృదయ మందిరంలో 
నాకు స్తానం వుందని తెలియ చెప్పిన ఆ తరుణం
జన్మజన్మలకు మరువలేని మదురమైన అమూల్యమైన వెలకట్టలేని గడియ

గోపికలేంతో మంది ని ప్రేమకు పాత్రులైన 
సత్య రుక్మిణిలతో ఎంత శక్యతగా నీవున్న 
ఈ రాధ ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పి నా జన్మను సార్ధకం చేసిన ఓ నా ప్రాణనాధ 

నీ పైనే ప్రాణాలు పెట్టుకొని నీ కోసం ఎదురు చేస్తున్న 

నీ నిచ్చెలికి ఒక్క సారి దర్శనమిచ్చి నయనానందం కలిగించుమా
జీవితం శ్రీ కృష్ణ భగవానుని రాస లీల వంటిది. రాస లీల అంటే జీవిత నాటకం. అందులో నృత్యం, సంగీతం, పాట పద్యం, పద కదలికలు, రంగులు అన్ని కల గలిపి ఉంటాయి..ప్రతి ఒక్కరు జీవితాన్ని పెదవులపై పాటలతో, మనసులో నవ్వులతో గడిపెయ్యాలి..జీవితాన్ని సప్త వర్ణాల సమ్మేళనంగా గడపాలి..బృందావనం కృష్ణుడు గడిపిన ఊహాజనిత పూల తోట కాదు. అది ప్రతి వ్యక్తి నివసించే ప్రదేశం..ఉత్తాహం, ఆనందం తో ఆ తోటను నింపేయాలి....జీవితం మనం మలచుకునే దానిని బట్టే ఉంటుంది. ఇష్టంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో జీవించటం నేర్చ్చుకుందాం.
కృష్ణ నీ సుందర ముఖారవిందాన్ని 
కనలేని నా బాధని అర్ధం చేసుకోకుండా 
ఎందుకలా కనుమరుగవుతావు కన్నయ్య
నీ దర్సనం కోసం వేచి చూస్తున్నాను.
కనలేని అందాన్ని కన్నుల్లో దాచావు
ఎనలేని మమతల్ని మదిలోగిలిలో నిలిపుంచావు
పూబాలల నెత్తావుల్ని తనువంతా ధరించావు
చెలువము మెచ్చిన చెలిమిని పల్లవించావు
మనసైన నేస్తమా హ్రుదయాలయంలో దీపమైనావు
దాచలేని ఓపలేని అనురాగ సమీరాల గిలివైనావు
విసురజ

shri krishna Gokul vivardhana Nandasuno Radhapathe Vraj janaarthi haraavatara!! Mitratmajaa thata viharana Lok bandho Damodaraachyutha vibho mama dehi Daasyam
ఓ కృష్ణ 
నీ ప్రియ వదనం వికసిత జలజం 
నీ దరహాసం జాబిలి కిరణం 
నీ శుభ చరణం ఏ పుణ్య ఫలము
నీ శుభ చరణం నీ శుభ చరణం ఈ రాధకు శరణం
ఓ కృష్ణా నీ మనోహరమైన అద్బుతరూపం ఎంతచూసిన తనివితీరదు కధయ్యా గోపాల ఆనాడు నంధవ్రయం లోని వారు ఎంతటి బాగ్యవంతులు అంతటి బాగ్యాన్ని నీ భక్తులమైన మాకు కల్పించిన నీది ఎంతటి కారున్యామయ్య గోవిందా గోపాల మురారి మాధవా హరి
ఓ కృష్ణ నీ వేణువు పలికే మదురగీతాల లాలనలో నిదురించాలి మాధవ గోవిందా మురారి
మునిజన మానస మోహిని యోగిని బృందావనం మురళీరవళికి ఆడిన నాగిని బృందావనం రాధా మాధవ గాధల రంజిలు బృందావనం గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
మాయమ్మ యని నే పిలచితే మాట్లాడరాదా 
న్యాయమా మీనాక్షి నీకిది నినువినా వేరు దిక్కేవరున్నారు

సరసిజభవ హరిహరనుత సులలితన నీ పద పంకజముల స్థిరమని నమ్మితి నమ్మితి నమ్మితిని
కరుణ జూడవే కాత్యాయని కాళికా భవాని పరమేశ్వరి సుందరేస్వరుని రాణి బలామ్బా మధురవాణి

మనకు కలిగే ఇబ్బందులన్నిటికి కారణం కోరికలే... కోరికలను పూర్తిగా జయించలేకపోయినా, వాటిని అదుపులో ఉంచుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి... ఏదో విధంగా మనం కోరికలను జయించగలిగితే సంపూర్ణమైన శాంతిని పొందగలం...
కంచి పరమాచార్య.
శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఙ్ఞానపీఠం
శరీరంలో ఏ అవయవాన్ని తాకినా వ్యక్తిని తాకినట్లే. ఒక గుండు సూది మొనతో శరీర లోని ఏ భాగాన్ని స్పృశించినా వ్యక్తి స్పందిస్తాడు. వ్యక్తి కంటికి కనబడడు. శరీరంలో భాగమైన ఏదైనా అవయవాన్ని ముట్టుకుంటే చాలు కనబడని వ్యక్తి స్పందిస్తాడు.


ఈ శరీరంలో నీవుండే చోటేది? నీ ఉనికికి కేంద్రమేది? అని ప్రశ్నిస్తే .. తన ఉనికి ఈ శరీరమంతా వ్యాపించి ఉంది అని వివరిస్తాడు. ఆరడుగుల ఎత్తు, 80 కిలోల బరువు ఉన్న దేహంలోనే వ్యక్తి అంతటా వ్యాపించి ఉన్నప్పుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అయిన పరమాత్మ ఈ ప్రకృతిలో అంతటా వ్యాపించి ఉండడంలో అతిశయోక్తి లేదు. అన్నీ తానే అయినప్పుడు దేనిని స్పృశించినా పరమాత్ముని స్పృశించినట్లే. అన్నీ తానే అయినప్పుడు దేనిని పూజించినా దానికి ఆయన స్పందించడంలో ఆశ్చర్యమే లేదు. విగ్రహాన్ని పూజిస్తే పరమాత్ముణ్ణి పూజించడమే అవుతుంది.
కృష్ణ... నీకు తోడుగా నిలిచెది..
కేవలం నా కరకమలాలే కాదు..
నీ అంత రంగము లోకి తొంగి చూడు ..

హృదయ మంతా నేనే నిండి ఉన్నాను ..
రాధా రాణి 
ఒక గురువుగారివద్దకు ఒకాయన శిష్యరికం చెయ్యాలని చేరాడు. గురువుని సేవించుకుని వారి అనుగ్రహం కలిగినదాకా వేచివుండేఓపికలేదాయనకు. తరచుగా గురువుగారూ నా కేదన్నా మంత్రముపదేశించండి, దానిని జపించి ధ్న్యమవుతాను అని రోజూ వేధించటం మొదలు పెట్తాడు. సరే ఈయన పోడుపడలేక సరే రేపు నీకు ఉపదేశం చేస్తాను రమ్మని చెప్పాడు గురువు గారు. ఈ యనకు సంతోషం పట్టరానిదయింది. రాత్రంతా ద్దనిగురించే ఆలో చించి, నేను మిగతావారి కంటే యోగ్యున్ని కనుకనే ఎప్పటినుంచోవున్నవాళ్ళకంటే నాకే గురువుగారు మంత్రోపదేశం చేస్తున్నారు,అని పొంగిపోయాడు. తలతలవారుతుండగనే శుచిగా గురువుగారి సన్నిధానానికి వెళ్ళాడు. ఏదో గొప్ప మంత్రం తనకు లభిస్తున్నదని ఆయనకు పరమానందంగా ఉన్నది. గురువుగారుఆయనను దగ్గరకు పిలచినాయనా ఇది పరమపవిత్రమయిన మంత్రం ,దీనిని జపించి తరించుఅని చెవిలో హరేరామ హరేరామ రామరామ హరెహరె ,హరెకృష్ణహరెకృష్ణ కృష్ణ కృష్ణ హరెహరె అనే నామ మంత్రాన్ని ఉపదేశించారు. అంతే శిష్యుని ముఖం లో ఒక్కసారి వుత్సాహం తుస్సుమని జారిపోయింది. నిరుత్సాహంగా వున్న శిష్యుని ముఖంచూసిన గురువుగారు ,ఏమ్ నాయనా అలా వున్నావేమి అని అడిగాడు. స్వామీ మీరేదో గొప్ప మంత్రం ఉపదేశిస్తారని ఆశపడివస్తే మీరిదా చెప్పేది. ఇదినాకు తెలుసు ,మాయిట్లో అందరికీ వచ్చు ,మాఊరి రామాలయమ్లో ప్రతిరోజు భజనగ పాడతారు తెలుసా? దీనిలో పెద్ద మహిమేమిఉంటుంది గురువుగారూ ? అని విచార పడ్డాడు. గురువుగారునవ్వి దగ్గరగూట్లోవున్న ,మసిగొట్టుక పోయిన ఒక రంగురాయిని తెచ్చి ఇచ్చి, నాయనా దీనిని తీసుకెళ్ళిఅమ్మటానికి ప్రయత్నించు ,కానీ పదిమందికి అమ్మచూపి దీనివిలువ ఎంతుంటుందో తెలుసుకో,అన్నిటికంటే ఎక్కడ ఎక్కువ ధర పలికితే అక్కడ అమ్ముదాము. ఆశ్రమఖర్చులకు కావాలి. ఈ పనిచేసి పెట్టు, తరువాత నీకు మంచిమంత్రంఉపదేశిస్తాను అని చెప్పాడు. శిష్యుడు దానిని తీసుకువెళ్ళి సరకులదుకాణం లో వున్న తనకు తెలిసిన ఒక వ్యాపారికి చూపాడు. ఆయన దీనిని చూసి, ఆ... ఇదేదో పాత రంగురాయి. కాసిని వుల్లిగడ్దలువస్తాయి అదే ఎక్కువ ఇవ్వమంటావా? అన్నాడు. అక్కడనుండి దానిని తీసికెళ్ళి కంసాలికి చూపాడు. ఇది రంగురాయి మహా అయితే ఒక 50 రూపాయలువస్తాయన్నాడు. దానిని ఇతను బంగారపు వ్యాపారివద్దకు తీసుకెల్లాడు. అక్కడ వాళ్ళు దీనిని ముక్కలగా చేసి వుంగరాలకు వేయవచ్చు నాలుగువందలిస్తామన్నారు. ఇలాకాదని దానిని ర్త్నాల వ్యాపారం చేసేవారివద్దకు తీసుకవెళ్ళగా వాళ్ళు అయ్యా ఇదిజాతిరత్నం పదివేల రూపాయలిస్తాం ఇస్తారా? అని అడిగారు. అబ్బో ఇదేదో విలువగలదానిలాగా వుందే ,అని పెద్దపట్టణానికి చేరుకుని అక్కడ వ్యాపారులకు చూపాడు. వాళ్లు ఆశ్చర్యపడి అయ్యా దీనికి లక్షరూపాయలదాకా విలువ చెల్లిస్తాం ఇస్తారా? అనిఅడిగారు. దాంతో ఇతనికి దీనివిలువ ఇంకా చాలాఉండవచ్చునని అనుమానం పెరిగి ఆరాజ్య రాజుగారివద్దకు దీనిని తీసుకెళ్ళి దర్శించుకుని రత్నాన్ని చూపించాడు. రాజుగారు దానిని అక్కడున్న రత్న పరీక్షకులకిచ్చి దీనివిలువ లెక్క కట్టమన్నాడు. వారు అనేకపరీక్షలు చేసి అత్యంత ఆశ్చర్యంతో, మహాప్రభూ భూమిమీద అత్యంత దుర్లభమయిన రత్నమిది దీని విలువను మనం లెక్కకట్టలేము . మన రాజ్యం మొత్తం ఇచ్చినా దీని విలువకు సరిపోదు అని వివరించారు. దానితో విపరీతమయిన ఆశ్చర్యానికి గురయిన ఆ శిష్యుడు, దానిని మాగురువుగారు అమ్మవద్దన్నారనిచెప్పి మహారాజు వద్ద సెలవుతీసుకుని గురువుగారివద్ద పరుగుపరుగున చేరాడు.. గురువుగారూ మీరెంత అమాయకులండి మీరిచ్చినది సామాన్య రాయికాదండీ అమూల్య మయినది. మీరెంత పిచ్చివారండి,ఇంతవిలువయిన రత్నం దగ్గరున్నా దీని విలువ తెలుసుకోలేకపోయారు. అని లబలబలాడాడు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ రత్నానికి ఎంతవెల నిర్ణయించారో వారి అమాయకత్వమేమిటో వివరించాడు. అప్పుడు గురువుగారన్నారు. చూసావా నాయనా ఈరత్నం విలువను ఎవరిస్తాయిని బట్టి వారు నిర్ణయించారు. పూర్తిగా తెలిసినవారే దీని అసలు విలువ తెలుసుకో గలిగారు. లేకుంటే వుల్లిగడ్డలకే దీని విలువ భావించబడేది. అలాగే నీకు కూడా వుపదేశించబడిన నామం విలువ తెలియలేదు. దానివిలువ తెలియాలంటె సాధించిననాడుగాని నీకు అర్ధం కాదు. అని వివరించాడు
పోతనామాత్యుడు గారి శ్రీ కృష్ణుడు
-------------------------------- త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప, ప్రాభాత నీ రజ బంధు ప్రభమైన చేలము పయిన్‌ రంజిల్ల, నీలాలక వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప మా విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్‌
ఈ పద్యం ఎందుకంత ఇష్టమంటే చెప్పడం కష్టం! కదిలే చిత్రాన్ని అక్షరాలలో బంధించే పద్యమూ కాదు. ఈ పద్యంలో కనిపించే కృష్ణుడు అపురూప ధీర సౌందర్య విలసితుడు. ఇందులో ఏదో తెలియని అలౌకికత ఉంది. ఆధ్యాత్మికావేశముంది. అది త్రిజగ్నమోహనమైన నీలకాంతి. నీలమంటే నలుపు. నలుపుకి కాంతి ఎక్కడిది? అదే మాయ. ముజ్జగాలనీ మోహింప జేసే మాయ. నల్లని మేఘముపై పడిన ఉదయసూర్యుని అరుణారుణకిరణంలా పైన ఉత్తరీయం ప్రకాశిస్తోంది. ఆ మూర్తిలో ఒక ఉత్సాహముంది. ఆ ఉత్సాహమా ముఖారవిందముపై కదలాడే నీలి ముంగురులలో ద్యోతకమవుతోంది. మా విజయునికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహమది.
ఆహా! అలాంటి వన్నెలాడు మోహనకృష్ణుని ఆ రూపం మదిలో ఆవేశించిన భీష్ముడు ఎంతటి ధన్యుడు! దాన్ని చూసి మనకి చూపించిన పోతన మరెంత ధన్యుడు!

కృష్ణా నా కలలకు కానుకవి నువ్వు నా ఊహలకు ఊపిరివి నువ్వు నా ఆశలకు రూపం నువ్వు నా చిరునవ్వులకు ప్రతిరూపం నువ్వు నీ ప్రేమ చెరలో చిక్కుకున్నాను బయటపడాలని లేదు బంధం అనుబంధమై అనురాగంగా పెనవేసుకోనీ జన్మ జన్మల ప్రణయమై.. ఆత్మీయతల పరిమళమై... Madhu Malikaకృష్ణాతరంగాలు
ఒకసారి కృష్ణ ప్రేయసి(తులసి) గా జన్మించి.. బృందావనం లో జీవించాలి.. ఒక ముత్తయిదువు బొటన వేలితో పసుపు, కుంకుమ పూయించు కొవాలి..
శాంతి మార్గము:--
(అశాంతితో అలమటించే మనస్సుకు ప్రశాంతత చేకూర్చే శాంతి వచనములు. ఇవి శ్రీకృష్ణ భగవానుని నోటిద్వారా వచ్చిన అమృత గుళికలు)
అయినదేదో మంచికే అయినది అవుతున్నదేదో అదీ మంచికే అవుతున్నది అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుంది నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకున్నావు నీవేమి సృస్టించావని నీకు నష్టం వాటిల్లింది? నీవు ఏదైతే పొందావో అవి ఇక్కడ నుంచే పొందావు ఏదైతే ఇచ్చావో అదీ ఇక్కడే ఇచ్చావు ఈనాడు నీవు నా సొంతం అనుకున్నదంతా ..... నిన్న ఇంకొకరిసొంతం-- రేపు మరొకరి సొంతం కాగలదు. పరివర్తన చెందడం అనేది లోకం యొక్క పోకడ. ఫలితం ఏదైనా దైవప్రసాదంగా స్వీకరించు కాలం విలువైనది, మంచి పనులు వాయిదా వేయకు అహింసను విడనాడకు-- హింసను పాటించకు కోపాన్ని దరిచేర్చకు ఆవేశంతో ఆలోచించకు ఉపకారం చేయలేకపోయినా -- అపకారం తలపెట్టకు దేవుడిని పూజిస్తూ...... ప్రాణికోటికి సహకరించు శాంతిమార్గమును అనుసరిస్తూ భగవదాసీర్వాదాన్ని పొందు ఓం శాంతి: శాంతి: శాంతి:..........
నీ శోభ కు లేవు ఎల్లలు నీ నామాలు కోకొల్లలు ఏ మని పిలిచెదను నిన్ను చూడంగ! మూగ బోదా! నా గొంతు.. శ్రీ రంగ రంగా!

నీ పద్యవలులన్ ఆలకించు చేవులున్
నిన్నాడు వాక్యంబులన్
నీ పేరున్ పనిచేయు హస్తయుగమున్ నీ ముర్తిపై చుపులున్
నీ పాదంబులు ప్రొంత మ్రొక్కు శిరమున్
నీ సేవపై చితముల్
నీ పై బుద్దులు మాకు ఇవ్వు కరుణన్ నీరజ పత్రేక్షణ
 
తల్లియు తండ్రియు నారాయణుడే గురువూ చదువూ నారాయణుడే యోగము యాగము నారాయణుడే ముక్తియు దాతయు నారాయణుడే
ఇహము పరము నారాయణుడే

ఎప్పుడైనా నీ మనస్సులో చెడు ఆలోచన కలిగినప్పుడు ,భగవంతుని సంతానమై ఉండి ఇంత నీచంగా ఆలోచించడమా అని నీ మనస్సు కి నచ్చచెప్పు..అప్పుడు నీకు మనోశక్తి అధికమై,మశ్శాంతి కలగ డాన్ని నువు గమనిస్తావు..నా సంతానమై ఉండి నీకు వినాశనం కలుగుతుందా? నా సంతానమై ఇక్కడకు వచ్చి ఉన్నవారికి ముక్తి లభించినట్లే ! అనుకుని భగవంతుడు కూడా యేమీ చేయ జాలడు...
వ్యక్తులను ప్రేమించినప్పు దు:ఖం,విషాదం తప్పదు..భగవంతుని ప్రేమించగలిగినవాడు నిజంగా ధన్యుడు..అతనికి దు:ఖం,విషాదం ఉండవు..
మనస్సును విచ్చలవిడిగా ఆలోచించనీయడంకంటే యెదో ఒక పని చేయడం ఉత్తమం..యెందుకంటే మనస్సుకు స్వాతంత్ర్యం ఇస్తే అది ఎంతో గందరగోళాన్ని సృస్టిస్తుంది..దుష్కార్యాలవైపే మనస్సు స్వాభావికంగా వెడుతుంది..మంచి పనులు చేయడానికి ఆసక్తి చూపించదు..
పౌర్నమి వెంబడి వచే అమావాస్యలా మనస్సు కూడా మంచి,చెడుల మిశ్రమమే..అది ప్రకృతి సహజం..కానీ మనస్సును స్తిరపరచడానికి ప్రాణాయామం,ధ్యానం చేయాలి..దానివల్ల మనస్సు నిశ్చలమై ప్రశాంతముగా ఉంటుంది..


1 కామెంట్‌: