14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

జై శ్రీరామ్ రామసుధ

రామ సుధ
- రామ్ నామాన్ని జపీంచేవారికి భయముండదు. రామ నామ జపం సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషధం.
- రామ నామం త్రిమూర్తులకు ప్రతీక.
- రామ నామం మోక్షదాయకం,మోక్షకారకం.
- నిధి కన్నా రాముని సన్నిధే మిన్న.
- సకల సద్గుణ నిలయుడు శ్రీ రాముడు.
- శ్రీ రామ నామస్మరణె ముక్తికి మార్గము.
- మూర్తీభవించిన ధర్మమే శ్రీ రాముడు.
- శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష.
- సీతమ్మ వల్ల భూలోకం పావనమైంది.
- రామ సంకీర్తన జరిగిన ప్రతి చోట హనుమంతుడు ఉంటాడు.
- ప్రతి రోజు రామ నామము జపంచేస్తూ,రాస్తూ ఉంటే మనశ్శాంతి లభిస్తుంది.
" ఓ రామ నీ నామం ఎంతో రుచిరా..."

జై శ్రీ రామ్ 

బ్రహ్మ కృత రామ స్తుతి:

తతో హి దుర్మనా రామః శ్రుత్వైవం వదతాం గిరః దధ్యౌ ముహూర్తం ధర్మాత్మా బాష్పవ్యాకులలోచనః ||
తతో వైశ్రవణో రాజా యమశ్చామిత్రకర్శనః సహస్రాక్షో మహేన్ద్రశ్చ వరుణశ్చ జలేశ్వరః ||
షడర్ధనయనః శ్రీమాన్ మహాదేవో వృషధ్వజః కర్తా సర్వస్య లోకస్య బ్రహ్మా బ్రహ్మవిదాం వరః ||
ఏతే సర్వే సమాగమ్య విమానైః సూర్యసన్నిభైః ఆగమ్య నగరీం లఙ్కామభిజగ్ముశ్చ రాఘవమ్ ||
తతః సహస్తాభరణాన్ ప్రగృహ్య విపులాన్ భుజాన్ అబ్రువంస్త్రిదశశ్రైష్ఠాః ప్రాఞ్జలిం రాఘవం స్థితమ్ ||
కర్తా సర్వస్య లోకస్య శ్రేష్ఠో జ్ఞానవతాం వరః ఉపేక్షసే కథం సీతాం పతన్తీం హవ్యవాహనే ||
కథం దేవగణశ్రేష్ఠమాత్మానం నావబుధ్యసే | ఋతధామా వసుః పూర్వం వసూనాం త్వం ప్రజాపతిః ||
త్రయాణాం త్వం హి లోకానామాదికర్తా స్వయమ్ప్రభుః | రుద్రాణామష్టమో రుద్రః సాధ్యానామసి పఞ్చమః ||
అశ్వినౌ చాపి తే కర్ణౌ చన్ద్రసూర్యౌ చ చక్షుషీ అన్తే చాదౌ చ లోకానాం దృశ్యసే త్వం పరన్తప ||
ఉపేక్షసే చ వైదేహీం మానుషః పాకృతో యథా ఇత్యుక్తో లోకపాలైస్తైః స్వామీ లోకస్య రాఘవః ||
అబ్రవీత్రిదశశ్రేష్ఠాన్ రామో ధర్మభృతాం వరః ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజమ్ ||
యో హం యస్య యతశ్చాహం భగవాంస్తద్ బ్రవీతు మే ఇతి బ్రువన్తం కాకుత్స్థం బ్రహ్మా బ్రహ్మవిదాం వరః ||
అబ్రవీచ్ఛృణు మే రామ సత్యం సత్యపరాక్రమ
బ్రహ్మ కృత రామ స్తుతి ప్రారంబం 
భవాన్నారాయణో దేవః శ్రీమాంశ్చక్రాయుధో విభుః ||

ఏకశృఙ్గో వరాహస్త్వం భూతభవ్యసపత్నజిత్ అక్షరం బ్రహ్మ సత్యం చ మధ్యే చాన్తే చ రాఘవ ||
లోకానాం త్వం పరో ధర్మో విష్వక్సేనశ్చతుర్భుజః శార్ఙ్గధన్వా హృషీకేశః పురుషః పురుషోత్తమః ||
అజితః ఖడ్గధృద్విష్ణుః కృష్ణశ్చైవ బృహద్బలః సేనానీర్గ్రామణీశ్చ త్వం బుద్ధిః సత్త్వం క్షమా దమః ||
ప్రభవశ్చాప్యయశ్చ త్వముపేన్ద్రో మధుసూదనః | ఇన్ద్రకర్మా మహేన్ద్రస్త్వం పద్మనాభో రణాన్తకృత్ ||
శరణ్యం శరణం చ త్వామాహుర్దివ్యా మహర్షయః సహస్రశృఙ్గో వేదాత్మా శతజిహ్వో మహర్షభః ||
త్వం త్రయాణాం హి లోకానామాదికర్తా స్వయమ్ప్రభుః సిద్ధానామపి సాధ్యానామాశ్రయశ్చాసి పూర్వజః ||
త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమోఙ్కారః పరన్తపః ప్రభవం నిధనం వా తే న విదుః కో భవానితి |
దృశ్యసే సర్వభూతేషు బ్రాహ్మణేషు చ గోషు చ దిక్షు సర్వాసు గగనే పర్వతేషు వనేషు చ |
సహస్రచరణః శ్రీమాన్ శతశీర్షః సహస్రదృక్ త్వం ధారయసి భూతాని వసుధాం చ సపర్వతామ్ ||
అన్తే పృథివ్యాః సలిలే దృశ్యసే త్వం మహోరగః త్రీల్లోఁకాన్ ధారయన్ రామ దేవగన్ధర్వదానవాన్ ||
అహం తే హృదయం రామ జిహ్వా దేవీ సరస్వతీ దేవా గాత్రేషు రోమాణి నిర్మితా బ్రహ్మణః ప్రభో ||
నిమేషస్తే భవేద్రాత్రిరున్మేషస్తే భవేద్దివా సంస్కారాస్తే భవన్ వేదా న తదస్తి త్వయా వినా ||
జగత్ సర్వం శరీరం తే స్థైర్యం తే వసుధాతలమ్ అగ్నిః కోపః ప్రసాదస్తే సోమః శ్రీవత్సలక్షణః ||
త్వయా లోకాస్త్రయః క్రాన్తాః పురాణే విక్రమైస్త్రిభిః మహేన్ద్రశ్చ కృతో రాజా బలిం బద్ధ్వా మహాసురమ్ ||
సీతా లక్ష్మీర్భవాన్ విష్ణుర్దేవః కృష్ణః ప్రజాపతిః వధార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తనుమ్ ||
తదిదం నః కృతం కార్యం త్వయా ధర్మభృతాం వర నిహతో రావణో రామ ప్రహృష్టో దివమాక్రమ ||
అమోఘం బలవీర్యం తే అమోఘస్తే పరాక్రమః అమోఘం దర్శనం రామ న చ మోఘః స్తవస్తవ ||
అమోఘాస్తే భవిష్యన్తి భక్తిమన్తశ్చ యే నరాః ||
యే త్వాం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమమ్ ప్రాప్నువన్తి సదా కామానిహ లోకే పరత్ర చ ||
ఇమమార్షం స్తవం నిత్యమితిహాసం పురాతనమ్ యే నరాః కీర్తయిష్యన్తి నాస్తి తేషాం పరాభవః ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే యుద్ధకా౦డే వింశత్యుత్తరశతనామః సర్గః —
సీతమ్మ అగ్నిలో దూకగానే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, దేవతలు మొదలైనవారందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళకి నమస్కారం చేస్తున్న రాముడిని చూసి వాళ్ళు అన్నారు " అదేమిటయ్యా రామ అంత పని చేశావు. నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహా విష్ణువువి. నువ్వు లోకములను సృష్టించగలిగినవాడివి, లయం చెయ్యగలిగినవాడివి, పరబ్రహ్మానివి. సీతమ్మని అగ్నిలో ప్రవేశించమని ఎలా చెప్పగలిగావయ్య " అన్నారు.

అప్పుడు రాముడు " మీరందరూ నేను చాలా గొప్పవాడిని అని అంటున్నారు, నేను పరబ్రహ్మాన్ని అంటున్నారు, కాని నేను అలా అనుకోవడం లేదు. నేను దశరథ మహారాజు యొక్క కుమారుడిని, రాముడిని, నరుడిని అని అనుకుంటున్నాను. నేను యదార్ధముగా ఎవరినో మీరు చెప్పండి " అన్నాడు.

అప్పుడు బ్రహ్మ " సృష్టికి ముందు ఉన్నవాడివి నువ్వు, స్థితికారుడివి నువ్వు, లయకారుడివి నువ్వు, వరాహమూర్తివి నువ్వు, భూమిని ఉద్ధరించినవాడివి నువ్వు, ఆరోగ్యం నువ్వు, కోపం నువ్వు, రాత్రి నువ్వు, నీ రోమకూపాల్లో దేవతలు ఉంటారు, సమస్తము నీయందే ఉంది, అంత్యమునందు ఉండిపోయేవాడివి నువ్వు, నువ్వు కన్ను ముస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు " అని రాముడిని స్తోత్రం చేశారు.


ఇది చాలా గొప్ప శక్తివంతమైన స్తొత్రమ్. ఇది విన్నా, పారాయణ చేసినా, రోజు చదువుకున్నంత మాత్రాన ఉత్తర క్షణ ఫలితాలను ఇచ్చేస్తుంది. వారికి పునర్జన్మ ఉండదు, మోక్షం కలుగుతుంది, కస్టాలు అన్ని తొలగిపోతాయని చతుర్ముఖ బ్రహ్మగారే ఫలశ్రుతి చెప్పారు. 

ఎక్కడెక్కడ రామాయణం చెబుతున్నప్పుడు బుద్దిమంతులై, పరమ భక్తితో రామాయణాన్ని ఎవరైతే వింటున్నారో అటువంటివారికి శ్రీ మహావిష్ణువు యొక్క కృప చేత తీరని కోరికలు ఉండవు. ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు ఆయా రంగములలో రాణిస్తారు. సంతానం లేని రజస్వలలైన స్త్రీలు ఈ రామాయణాన్ని వింటె, వాళ్ళకి గొప్ప పుత్రులు పుడతారు, తమ బిడ్డలు వృద్ధిలోకి వస్తుంటే చూసుకొని ఆ తల్లులు ఆనందం పొందుతారు. వివాహము కానివారికి వివాహము జెరుగుతుంది, కుటుంబం వృద్ధిలోకి వస్తుంది, వంశము నిలబడుతుంది, మంచి పనులకి డబ్బు వినియోగం అవుతుంది, దూరంగా ఉన్న బంధువులు తొందరలో వచ్చి కలుసుకుంటారు, ఇంటికి మంగళతోరణం కట్టబడుతుంది, ఎన్నాళ్ళనుంచో జెరగని శుభకార్యాలు జెరుగుతాయి, పితృదేవతలు సంతోషిస్తారు. చాగంటి సంపూర్ణ వాల్మీకి రామాయణం లింక్ లో http://sampoornaramayanam.blogspot.in/2010/05/1_05.html

రామాయణ నీతి వినుడు భక్తులారా రామనామ గాన పాన రక్తులారా ఒకే మాట ఒకేబాణం ఒకటియే సతి ఒకేధర్మపథము ఇదేరామనీతి విష్ణుమూర్తి రాముడై అవతరించే విశ్వరక్షనార్తమై భువిజనించే ధర్మవైరి ఐనదనుజు శిరముల ద్రుంచె ధర్మమూర్తి తానై సత్కీర్తి గాంచె ॥ రామాయణ నీతి వినుడు భక్తులారా
మారీచుడు వరుణుడికి చెప్పిన నీతి రాముడి దర్మం సులభాః పురుషా రాజన్ సతతం ప్రియ వాదినః | అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః || " రావణా! మన మనస్సుకి ఇష్టమయ్యేటట్టు మాట్లాడేవాళ్ళు చాలామంది దొరుకుతారు, కాని వాళ్ళు మనన్ని అభ్యున్నతి వైపుకి నడిపించేటట్టుగా మాట్లాడేవారు కాదు. కొంతమంది మాట్లాడితే అప్రియంగా మాట్లాడినట్టు ఉంటుంది, కాని ఆ మాటలలో అవతలివారి అభ్యున్నతిని గూర్చిన మాటలు ఉంటాయి. అలా మనకి మంచి చెప్పేవాడు దొరకడు, ఒకవేళ అలాంటివాడు దొరికిన ా వినేవాడు దొరకడు. నీకు ఎవరో గూఢచారులు చెబితే రాముడి గురించి విన్నావు. ఆ గూఢచారి పరమ దుర్మార్గుడు, నీ మీద కక్షకట్టి నీ ప్రాణములు తియ్యాలని చూస్తున్నాడు. అందుకని నీకు అన్నీ అసత్యములు చెప్పాడు. నువ్వు ఇప్పటిదాకా రాముడి గురించి చెప్పినవన్నీ అబద్ధాలు. రాముడు మహా ధర్మాత్ముడు, మహేంద్రుడికి, వరుణుడికి ఎటువంటి పరాక్రమము ఉంటుందో రాముడికి అలాంటి పరాక్రమము ఉంది. అందరూ వచ్చి రాజ్యం తీసుకో అని అడిగినా, తన తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కొసమని రాముడు అరణ్యాలకి వచ్చాడు. నీ మాటలు వింటుంటే నాకు ఒక అనుమానము వస్తుంది, సీతమ్మ మానవ స్త్రీ కాదు, నిన్ను చంపడానికని, రాక్షస కులాన్ని నాశనం చెయ్యడానికని భూమిమీదకి వచ్చిన దేవతా స్త్రీ. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నువ్వు నశించిపోతావు, నీతోపాటుగా లంకా పట్టణం నశించిపోతుంది, రాక్షసులందరూ భూమిమీద పడి నశించిపోతారు. నీకు ఎవరో అబద్ధాలు చెప్పారు, ఆ మాటలు విని అన్నీ నీకు తెలుసనుకొని ఆ మాటలు ఇంకొకరికి చెబుతున్నావు. నువ్వు రాజువి, ఇంత చపలబుద్ధితో ఉండకూడదు.
Thyagaraja Kriti - Jo Jo Rama ప. జో జో రామ ఆనంద ఘన
చ1. జో జో దశరథ బాల రామ జో జో భూజా లోల రామ (జో)
చ2. జో జో రఘు కుల తిలక రామ జో జో కుటిల తరాలక రామ (జో)
చ3. జో జో నిర్గుణ రూప రామ జో జో సు-గుణ కలాప రామ (జో)
చ4. జో జో రవి శశి నయన రామ జో జో ఫణి వర శయన రామ (జో)
చ5. జో జో మృదు తర భాష రామ జో జో మంజుళ వేష రామ (జో)
చ6. జో జో త్యాగరాజార్చిత రామ జో జో భక్త సమాజ రామ (జో)

రామాయణం(Ramayanam)
దశరధుడు
ముగ్గురి పెనిమిటి
అయోధ్య రాజు
ఆ మారాజుకు
పిల్లలు పుట్టకున్న
యజ్ఞం చేసెను
అగ్నిదేవుడు
ఇచ్చిన పాయసాన్ని
భార్యలకిచ్చె
ఆ ఱేడునకు
నలుగురు పిల్లల
సంతతిగల్గె
రామ లక్ష్మణ
భరత శతృఘ్నులు
తన పిల్లలు
జనకునకు
కూతురు దొరికెను
సీతరూపాన
స్వయంవరాన
విరిచెను రాముడు
శివ ధనుస్సు
సీతతో పెండ్లి
జరిగెను రామునకు
వైభవముగా
అయోధ్యలోన
కైకేయి పెట్టినది
మడతపేచీ
పంపించాలంది
రాముని అడవికి
వనవాసిగా
బయల్దేరెను
సీతాలక్ష్మణులతో
రాముడు ఇక
ఒక రక్కసి
రాముని వెంటాడగా
తమ్ముడు జూసె
శూర్పణఖవి
ముకుచెవులుగోసి
చేతిన బెట్టె
మాయలేడిని
చూసిన సీతాదేవి
కావాలనెను
రాముడు వెళ్ళె
తరువాత తమ్ముడు
లక్ష్మణుడెళ్ళె
రావణుడొచ్చి
భిక్షమునడగుచూ
కుట్రనుపన్నెలక్ష్మణ రేఖ
దాటిన సీతమ్మను
అపహరించె
హనుమంతుడు
రాముని భక్తుడయ్యి
లంకనిజేరె
సీతను జూసి
తను తీసుకొచ్చిన
ముద్రిక జూపె
రాక్షస మూక
తనను బంధింపగా
లంకను గాల్చె
వానర సేన
సాయముతో రాముడు
వారధి కట్టె
సేతువు దాటి
లంకను జేరగనే
యుధ్ధముజేసె
ఆ యుధ్ధమున
హతుడై రావణుడు
నేలన్ గూలె
సీతతో సహా
మన రామయ్యతండ్రి
అయోధ్యజేరె!

రామా...
నీవెందరికో దేవుడివికావచ్చు
కానీ... నాకు మాత్రం
మీరు నా కన్న తల్లిదండ్రులే... తండ్రీ
నా... రామయ తండ్రీ......

ఒకే పాటలో మొత్తం రామాయణం దృశ్యకావ్యంగా

https://www.facebook.com/photo.php?v=384855951551151

శ్రీరామ మంగళ హారతి-

రామ చంద్రాయ జనక రాజ జా మనోహరాయ

మామకా భీష్ట దాయ మహిత మంగళం 

కౌసలేసాయ మంద హాస దాస పోష ణాయ
వాసవాది వినుత స ద్వరాయ మంగళం 

చారుకుంకుమోపేత చందనానుచర్చితాయ 
హారకటకశోభితాయ భూరిమంగళం 

లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ 
జలజ సదృశ దేహాయ చారుమంగళం 

దేవకీ పుత్రాయ దేవదేవోత్తమాయ
భావజాత గురువరాయ భవ్యమంగళం 

ఫుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ
అండ జాతవాహనాయ యతులమంగళం 

విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ 
సుజన చిత్త కామితాయ శుభగమంగళం 

రామదాసాయ మృదుల హృదయకమల వాసాయ 
స్వామి భద్ర గిరివరాయ సర్వ మంగళం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి