రామనామ మహాత్యము గురించి ఇతిహాసమొక్కటి పెద్దలు చెప్తారు వనే చ’రామో’, వసు చా హ’రామా’! నదీం స్త’రామో’, నభయం స్మ’రామః’!! ఒకానొక సమయంలో దారిదోపిడీ చేసే గజదొంగలు ఇలా మాట్లాడుకుంటున్నారట. మనము వనములందు (చరామః) సంచరిస్తున్నాము, వీలైనంత (హరామా.) దొంగిలిస్తున్నాము, మనకు దారిలో అడ్డువచ్చిన నదులను (తరామః) ఈది దాటుతున్నాము, మనము అభయము అన్నదానిని (స్మరామః) స్మరిద్దాము అని అనుక్కుంటుండగా వారందరూ ప్రమాదవశాత్తూ మరణించారు, ఆ సమయమందు రామా రామా అన్న శబ్దమును ఉచ్చరించడంతో ఉద్దరింపబడి ముక్తిని పొందారు. కాబట్టి శ్రీ రామనామఉచ్చారణము తెలియక చేసినా ముక్తికి ఆలంబనం అవుతుంది. ఇక తెలిసి తెలిసి ఒక యాగంలా చేస్తే దాని ఫలితమెంతటిదో ఊహకందుతుందా!. రామ హరే కకుత్థ్సకుల రామ హరే రఘురామ రామ శ్రీ రామ హరే యటంచు మది రంజిల భేక గళంబులీల నీ నామము సంస్మరించిన జనంబు భవంబెడ బాసి తత్పరం ధామ నివాసులౌదురఁట దాశరథీ! కరుణాపయోనిధీ! ఏతత్ సర్వం శ్రీ హనుమ ద్లక్ష్మణ భరత శత్రుఘ్న సకల పరివార సమేత సీతారామచంద్రార్పణమస్తు. http://andhraamrutham.blogspot.in/2012/09/blog-post_14.html#.UycgwPmSxWY |
14, ఫిబ్రవరి 2014, శుక్రవారం
శ్రీ రామనామ మహత్యం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి