3 ప్రానులంతా వేణువులే అవి పలికేది నీ రాగమే కృష్ణ వేణువైన నా ప్రాణం స్వాసించేది నీ ఊపిరే |
4 శిఖిపించమౌలి మయూరములతో కలిసి నాట్యం చేస్తూన్న నీవు మయూరంవలె కనిపిస్తున్నావు కృష్ణా నీవు అస్ఖలిత బ్రహ్మచారి అని నీ శిఖిపించాన్ని చూసి అనుకున్నాను కానీ ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను ధన్యచరిత |
6 శ్రీకృష్ణ నీకై నీను పూలమాలిక సిధం చేసితిని వచ్చి నీ కంటమందు అలంకరించుకొని నన్నుఆనంధపరచరా ముకుంద చేతియందు మోహన మొరలితో శిఖిపించాన్ని దరించి వచ్చే నీరాకకై ఈ రాధా ఎదురు చుస్తుంది వేగమె రారా మొరారి |
8 ఓ నిలమేఘవధనా కృష్ణా నీ రూపం మధురం నీ నయనం అత్యంత మధురం
నీ రూపంలోని వెన్నెలను ఘని నెలరాజు చిన్న బోయే కదా కృష్ణ
నీ వేణువు పలికే మధుర గీతములతో నన్ను మైమరపిస్తున్నావు మాధవ |
10 మొరలి మనోహర యెర్రనిఅరవింధ కాంతితో రమణీయమైన నీ మృదు కరారవింధం తాకిన ఆ మొరలి తపమేమి చేసెనో కదా కృష్ణా
|
11 శ్రీకృష్ణ రాధామనోహర గోకులప్రదీప గోపీజనవల్లభ జగన్మోహనాకార
ముకుందా ఎదుబూషణ హరి వెన్నేలకురిసేవేల పొన్నచెట్టు నీడలో గోపకాంతల మధ్యలో అపురూపమైన నీ దర్శనం ఎంతో పుణ్యప్రదం కృష్ణ |
12 కృష్ణయ్య నీ సౌందర్యశోభ తో నీకు చేసిన అలంకరనలె కొత్త అందాలను సంతరించుకున్నయి జై శ్రీ కృష్ణ
|
16 కృష్ణా జన్మలెన్ని ఎత్తినా నీ ప్రాణ సఖినై పుట్టేలా వరమొక్కటి ఇవ్వుమా మాధవ |
17 కృష్ణా నిన్ను చూసే నా కన్నులకు శృష్టి లో ఏది నీకంటే వేరుగా నాకు కనిపించట్లేదు సర్వం కృష్ణమయంగా కనిపిస్తుంది ఎప్పుడు నిన్నే చూడాలి అన్న నా కోరిక ఇలా తీర్చావ కృష్ణ |
20 జగన్మోహన సౌందర్య స్వరుపాకారుడివైన శ్రీ హరి నీవు వరాహస్వామి అవతారము దాల్చి భూమిని జలమునుంది బయటకు తీసి ఈ ధరామండలాన్ని ఉద్దరించిన మహానుబావుడివి హరి ఓ వరాహావతార నీకు శరణు శరణు జై హో నారాయణ |
21 ఈ రాధ హృదయం మాధవ నిలయం మన రాధామాధవుల మమతానురాగ బంధం నిలిచేడు కలకాలం మువ్వ గోపాల నీ పాద మంజీరాలు పలికే పద భావాలు ఈ రాధిక అందించెను నీకై నవరాగ మాలికారాధ హృదయాన మాధవు యెద సడి |
23 చంద్రవంశానికి వన్నేతెచ్చిన ఓ శ్రీ కృష్ణ రజనీకర కులతిళక నీవు ఆ చంద్రుని వలె కనిపిస్తూ కనులకువిందు చేస్తున్నావు ముకుంద |
24 జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం వేదాల సారమంతా వాసు దేవుడే జై శ్రీ కృష్ణ |
26 బగవంతునిలో లినమయ్యే వేదనలు నలుగు అవి భక్తి, విరహము, వైరాగ్యము, శతృత్వము. అర్జునుడు భక్తితో రాధా విరహముతో కుంతి వైరాగ్యముతో శిశుపాలుడు శతృత్వము తో క్రిష్ణుడినే చేరుకున్నారు |
27 కృష్ణ నాకు నిరంతరం నీ జ్ఞాపకంమే నీ జ్ఞాపకాల కారాగారంలో నేను బందీని నీ జ్ఞాపకాల అంతఃపురం లో నేను రాణిని కృష్ణ అందుకే నీ జ్ఞాపకం ఓ వరం |
29 కృష్ణ నా మాటలలో మౌన గీతం నువ్వు నీపై మనసున్న గోపిక నీను అందుకే నీ మొరలి నన్ను చేరింది నా ఉపిరితో నీ మొరలి పలికింది |
30 కృష్ణా నీను ఒక వెదురు వేణువు నీవు తీసే ఊపిరి నాలో ప్రాణం అనేరాగం పలకడానికి కారణమయ్యింది మురళీధరా ముకుందా నాప్రాణం అనే రాగం నీ నామాన్నే సదా కీర్తించేలా నీవే నన్ను అనుగ్రహించాలి |
32 గోవిందసుందరమోహణ మురారి హే గోపల హే క్రుపాజలనిది అంటూ లీలాశుకుడు కీర్తించగా విన్నాను కృష్ణా ఆ గోపాలుడిగా దర్శనాన్ని అనుగ్రహించి కృపాజలినిదిఅన్న నీ నామాన్ని నాకు అర్ధమయ్యేలా చేసావు గోపిజనవల్లబా |
33 శ్రీహరి నీవు చక్కని నీలిమేఘ కాంతితో ఆ గోవుల మంధలను కాస్తూ కధంభవనం లో సంచరిస్తూ నీ వేణుగానం తో జగాలను ఓలలాడించిన నీ కృష్ణావతారం ఎంతో రమనీయమైనది గోవింద ముకుందా |
37కృష్ణా నిన్ను తోడుగా నిన్ను అంటిపెట్టుకుని ఉండేవి కేవలం నా కరకమలములు మాత్రమే కాదు నా హృదయం లోకి చూడు కృష్ణా నా హృదయ మంతా నీవే నిండి ఉన్నా |
38 కృష్ణా మార్పులేని నా హృదయతూర్పు వాకిలి లో ఉదయసూర్యుని తొలికిరణం నీవు
నా సర్వము నీవే సర్వేశ
|
39 కృష్ణా నీ మది సామ్రాజ్యానికి నీను ఎప్పుడు దగ్గరే ఉన్నా చీకటిలో కుడా వెలుతురు విన్యాసం చూస్తున్నా ..!! |
40 కృష్ణా ఈ పూలకు, గాలికి ఉన్న సంబంధం ఈ రాధరాణికి నీకు మధ్యన ఉన్న దూరం ...జై శ్రీ కృష్ణ |
41 కృష్ణా క్షణక్షణం నా జ్ఞాపకం నీవు నా అంతర్ముఖంలో నిలిచిపోయిన రూపం నీవు నా హృదయ పొరల్లో ఉభికే అలల ప్రేమభావం నీవు నా ఆత్మచింతనా సాగరతీరంలో నడిచిన గురుతువు నీవు |
42 కృష్ణా గోపిజనవల్లబా ముకుంద మాధవ మురారి నీను నీ రాధను నీనే నీ రాధను ఆనంద ముకుందా కృష్ణ గోపాల నాకుసాటి నీకు వేరెవరు లేరు నాతో ఎవరు సరితూగరు గోవర్ధనగిరిధారి శికిపించమౌలి |
43 కృష్ణ ఓ ఆనంద స్వరూపకృష్ణ సర్వకర్షణమునీ స్వరూపము నీవు నా మనసును ఆకర్షించి నీపధములయందు నిరతిశయ భక్తిని కృప చేయి ఎదునంధన ముకుందా |
44 కృష్ణా నిన్ను కోరుకునే నా మనసుకు ఆనందాన్ని కలిగించే నీ దుర్లభమైన దర్శనము తో నా నిరరీక్షణ ఫలించినది ఎదునంధనా నిరంతరం నా నేత్రములతో నిన్నే వీక్షిస్తూ ఉండే అదృష్టాన్ని నాకు కలిపించావ జనార్ధన |
49 గోవులగోపయ్య కృష్ణయ్య
చుడచక్కనయ్య మువ్వగోపాలా
నీ ముద్దుమోము ఎంతమధురమయ్య
నీ కరునించుచూపు ఎంతచల్లనయ్య
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి