తల్లియు తండ్రియు నారాయణుడే
గురువూ చదువూ నారాయణుడే
యోగము యాగము నారాయణుడే
ముక్తియు దాతయు నారాయణుడే
ఇహము పరము నారాయణుడే
ఎప్పుడైనా నీ మనస్సులో చెడు ఆలోచన కలిగినప్పుడు ,భగవంతుని
సంతానమై ఉండి ఇంత నీచంగా ఆలోచించడమా అని నీ మనస్సు
కి నచ్చచెప్పు..అప్పుడు నీకు మనోశక్తి అధికమై,మశ్శాంతి కలగ
డాన్ని నువు గమనిస్తావు..నా సంతానమై ఉండి నీకు వినాశనం కలుగుతుందా? నా సంతానమై ఇక్కడకు వచ్చి ఉన్నవారికి ముక్తి లభించినట్లే ! అనుకుని భగవంతుడు కూడా యేమీ చేయ జాలడు...
వ్యక్తులను ప్రేమించినప్పు దు:ఖం,విషాదం తప్పదు..భగవంతుని ప్రేమించగలిగినవాడు నిజంగా ధన్యుడు..అతనికి దు:ఖం,విషాదం ఉండవు..
మనస్సును విచ్చలవిడిగా ఆలోచించనీయడంకంటే యెదో ఒక పని చేయడం ఉత్తమం..యెందుకంటే మనస్సుకు స్వాతంత్ర్యం ఇస్తే అది ఎంతో గందరగోళాన్ని సృస్టిస్తుంది..దుష్కార్యాలవైపే మనస్సు స్వాభావికంగా వెడుతుంది..మంచి పనులు చేయడానికి ఆసక్తి చూపించదు..
పౌర్నమి వెంబడి వచే అమావాస్యలా మనస్సు కూడా మంచి,చెడుల మిశ్రమమే..అది ప్రకృతి సహజం..కానీ మనస్సును స్తిరపరచడానికి ప్రాణాయామం,ధ్యానం చేయాలి..దానివల్ల మనస్సు నిశ్చలమై ప్రశాంతముగా ఉంటుంది..
|