10, మార్చి 2014, సోమవారం

భగవన్నామం

ఈశ్వరుడు మిమ్ములను స్మరించకపోతే - మీరు ఈశ్వరుని స్మరించలేరు. అసలు ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలనే తలంపే మీకు పుట్టదు. సత్యాన్ని తెలుసుకోవాలనే బలమైన కోరిక మీకు కలుగుతుంటే - ఈశ్వర సంకల్పం మీ మీద ఉన్నట్లే!
భగవాన్ రమణ మహర్షి
శ్రీహరి సేవకు యోగ్యమైన పూజా పుష్పాలు ? .......................................................... శ్లో:- అహింసా ప్రథమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః సర్వ భూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః శాంతి:పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తధైవచ సత్యమష్ట విధం పుష్పం విష్ణో:ప్రీతికరం భవేత్ . భావము:- *అహింస ఇంద్రియ నిగ్రహము సర్వ భూత దయ ఓర్పు శాంతి పరమాత్మకై తపించుట పరమాత్మ ధ్యానము సత్యనిరతి అనే ఎనిమిది విధాలైన పుష్పాలతో శ్రీహరిని ఆరాధిస్తే అనుగ్రహిస్తారు.
విష్ణు సహస్రనామం ఎవరైన చదవచ్చు ,ఎక్కడెనాచదవచ్చు .మీరేపని చేసుకుంటూనైన నామం చేసుకోవచ్చు. మంత్ర జపం అలా చేయలేము. మంత్ర జపం చేయటానికి అంగన్యాస కరన్యాస ఉంటుంది. లలిత సహస్రనామం అలా చదవలేము . అది గురుముకుతః నేర్చు కోవాలి . నిలబడి మాత్రం చదవకూడదు , కూర్చొని మాత్రమే చదవాలి . విష్ణు సహస్రనామంకి ఆ నియమము లేదు.
ఎందు చేత అంటే . జాగృత్ అవస్థ అనగా ఇంద్రియములు పనిచేయట . పడుకోవటం అంటే నిద్రావస్థ మనసు ఇంద్రియములు వెనక్కు లాకుంటుంది. దీనికి అది దేవత పరమేశ్వరుడు . అందుకే పడుకునే ముందు "శివ శివ" అని 11 మార్లు చెప్పాలి. నిద్ర లేచినాక జాగ్రుతవస్థ , విష్ణువు స్తితి కారకుడు కావున "శ్రీహరి శ్రీహరి శ్రీహరి " అని 3 మార్లు చెప్పాలి . నిద్ర లేచిన తరువాత శుచిగా ఉంటామని ఆస్కారం లేదు. కావున విష్ణు సహస్రనామం చెప్పటానికి సుచి సమయం అంటూ శాస్త్రం లో ఎక్కడ చెప్పలేదు . మంచం మీద ఎటువంటి పని చేయకూడదు ( కొత్త బట్టలు పెట్టకూడదు , మందు వేసుకోకుడదు , చివరికి మనషి చనిపోయే సమయం లో మంచం మీద ఉంచకూడదు ). మనకి మంచం మీద ఎటువంటి దుస్వప్నము వచ్చిన తెల్లవారి గజేంద్ర మోక్షం చదువుకుంటే దోషం పోతుందని అంటారు. మనం అంత వరకు ఉండలేము కాబట్టి . గోవింద నామం చెప్పమంటారు.విష్ణు సహస్రం ఏ కారణం చేత విడువరదని శాస్త్రం చెప్పుచున్నది.
ఎవరితే విష్ణు సహస్రనామస్తోత్రం గొప్ప వరం ఎవరితే పారాయణము చేస్తారో ఇహమునందు రక్షణ లబిస్తుంది
క్రూరాత్ముఁ డజామీళుఁడు నారాయణ యనుచు నాత్మ నందును బిలువన్ ఏ రీతి నేలుకొంటిని యేరీ నీసాటి వేల్పు లెందును కృష్ణా!
.కృష్ణ శతకము . ఓ కృష్ణా!అజామీళుడు అను బ్రాహ్మణుడు పాపాత్ముడు అయినను,నిన్ను ఉద్దేశింపక తన కొడుకును నారాయణా అని మృత్యుకాలమున పిలిచిన మాత్రమున అతనికి మోక్షమిచ్చితివే!అట్టి నీ సాటి దేవతలింకెవ్వరు, ఎక్కడును లేరు.

శతం విహాయ భోక్తవ్యం! సహస్రం స్నానమాచరేత్!! లక్షం తత్వాతు దాతవ్యం! కోటిం త్వక్త్వ హరిం స్మరేత్!!
తాత్పర్యం: వంద పనులున్నపటికి వదిలిపెట్టి భోజనం చేయవలెను. వేయి పనులున్నను మాని స్నానం చేయవలెను. లక్ష పనులున్ననూ వాటిని పరిత్య జించి దానము చేయవలెను. కోటి పనులున్నప్పటికి వాటిని త్యజించి భగవంతుని స్మరించవలెను

పాపము అంటే?
ఈశ్వర ప్రస్థానము నందు ప్రతిబంధక స్వరూపమే. భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చేస్తున్నపుడు మీకు అడ్డుగా వచ్చేది ఏదో దానికి పాపము అని పేరు
''భాగవతము లో శ్రీ కృష్ణ భగావనుడు చెబుతారు'' (దీయమనాన్ నే గ్రుహ్ అతి విన మత్ సేవనత్ జానీ) అంటే నా భక్తులు సకల ఐశ్వర్యములను నా సేవ కోసం త్యాగం చేస్తారు అని అట్టి భాగవతోత్తముల పాదములకు క్రిష్ణభాగవానునికి నేను సదా నమస్కారిస్తాను జై శ్రీ కృష్ణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి