10, మార్చి 2014, సోమవారం

2 కృష్ణునిపై నా ఆరాధనా బావనలు జై శ్రీ కృష్ణ

శ్రీకృష్ణ ఎదునంధన గోపకిశోర గోవర్ధనోద్దార గోపాల అయ్యా గోవు ఎలాగైతే గడ్డిపైగల వ్యామోహంతో గోపాలుడైన నీ ఆజ్ఞ నుండి తప్పిపోయి దానికి కడుపునిండిన తరువాత చీకటి పడిపోయి ఆ అంధకారం లో దిక్కు తోచని స్తితి లో ఉన్న ఆ గోవుని వెతుకుతూ గోపాలుడైన నీవు స్వయంగా వెళ్లి దానిని రక్షిస్తావు గోవుని వెతికి పట్టు కొని రక్షించే గోవింద నీను కూడా నీవు కాచే జగత్తు అనే ఆలమంధలో ఒక గోవునయ్యా నీను కూడా విషయభంధములపై వ్యామోహంతో నీ ఆజ్ఞను ధాటి కారడవి పాలయ్యాను కమలాక్ష నా వ్యామోహంలో జీవితం ముగింపు అన్న చీకటి పడిపోతుంది అని ఆందోళనగా ఉంది మురారి నిన్ను చేరుకోలేని ఈ జీవుడు అన్న గోవుని వెతుకుతూ వచ్చి నేవే ఈ బావబంధముల నుండి నన్ను రక్షించాలి మాధవకృష్ణ నీవే నన్ను రక్షించు వాడవు నీవు తప్ప నాకు వేరెవరు లేరు దయాకర నీతో నా బందం శాశ్వతం మిగతావన్నీ వ్యామోహాన్ని కలిగించే మాయ వాటియందు నీను చిక్కుకు పోయాను ధన్యచరిత నన్ను రక్షించు రమాపతి నీరాకకై ఈ జీవుడు అనే గోవు ఎదురుచూస్తుంది ఎదుబుషణ హరినారాయణ పరమాత్మా పరమేశ్వర జై జనార్ధన
నా మనస్సు కోవెలలో వెలిసిన కృష్ణ గోపాల నీ దివ్యస్వరుపమునే నా మనస్సు కోవెలలో ప్రతిష్టించితిని మహానుబావ కోకిల స్వరంతో నిన్ను అర్చించితిని ముకుందా నీ పాదసేవ చేయుబాగ్యాన్ని జన్మ జన్మల ప్రసాదించమని కోరితిని శ్రీపాద నీ పెదవులపై వేణువువలె నా ప్రాణానికి ఆధారం నీవే కన్నయ్య నా మానస లోకము లో నిత్యం నీ శ్లోకములు ఆలపించేల నన్ను అనుగ్రహించు గోవిందా
రామయ్య తండ్రి అద్బుతమైన నీ శ్రీరామ నామాన్ని నాచేత సదా పాల్కించు నిత్యం నీ నామస్మరణ చేసేలా నన్ను అనుగ్రహించు దాశరధి రఘురామ
కృష్ణయ్య నీ అనుగ్రహం వల్లనే భక్తి సంప్రాప్తం అవుతుంది మాధవ ధర్మ అర్ధ కామములు నా తెలివి విశేషం వల్ల పొందగలను అచ్యుత నీ అనుగ్రహ విశేషంవల్లనే నీను మోక్షం పొందగలను అంతటి అనుగ్రహ విశేషాన్ని నాకు సంప్రాప్తింప చేయి జగనాథ ఈ అవని నాటకం లో నన్ను నీవు అనుగ్రహించు అవనినాధ ఈ జగత్తులో నీవే నాకు ఏకైక మార్గం ప్రబు గోకులప్రదీప హరి నాకు శుద్దసంకల్పాన్ని అనుగ్రహించు దివ్యస్వరూప గోవింద
కృష్ణయ్య నీమీద ఆ ఎశోదమ్మకి ఎంతటి కరున్యమయ్యా కన్నయ్య నీవు గోపకాంతల ఇండ్లల్లో పాలు వెన్నె త్రాగి కుండలని పగలగొట్టి ఎన్నెన్ని చేసావు వారిని నీవు పెట్టిన అనేక రకాల అల్లరంతా తాళలేక వారు ఎశోదమ్మ తో మొరపెట్టుకుంటే ఎశోదమ్మ ఎమో మీ ఇంట్లో పిల్లి దురుతుందేమోనని మీరు పాలు పెరుగు వాగేర పదార్దములు జాగ్రత్త పరచినట్లే మపిల్లాడు కృష్ణుడి నుండి కూడా అలాగే జాగ్రత్త పరచుకోడి మీరు జాగ్రత్తగా ఉండకుండా మా కృష్ణయ్య మీద చాడీలు చెప్పకండి అని ఆ గోపాకాంతలని తిరిగి మందలించింది నిన్ను ఎంత వెనకేసుకువచింధయ్య చిట్టికన్నయ్య అంత ప్రేమ నీపై ఉండబట్టే జగత్తుని కన్నతండ్రివినీవు ఎశోధంమకి కొడుకువనిపించుకుంటావు
శ్రీకృష్ణ వాసుదేవ యాధవేంద్ర ఎదుబుషణ ఎదువంశకిశోర నిన్ను ఎన్ని నామములతో పిలిచినా నామనసుకి తనివి తీరదు కదయ్య గోకులప్రదీప గోవింధముకుంద హరినారాయణ
సత్యధర్మనిధి ఐన శ్రీ రామ చంద్ర ప్రబు నీ పాదములయందు నాకు నిరతిశయ భక్తి కటాక్షించు కమలాక్ష ఆశ్రితపక్షపాత సుజనబంధవా రామ
కృష్ణా చల్లని నీ కళ్ళలో కలలా నిలిచిఉన్నాను కమలాక్ష నేను నీలో ఉన్నానని నా మనసు సేద తీరుతుంది మానసచోర ఈ గుండె కొట్టుకుంటోందంటే... దానికి కారణం నా యెదలోతుల్లో... నువ్వు చేసే సవ్వడి సజ్జనరుషిమందారా ఆ సవ్వడే నా గుండె చప్పుడై నన్ను బ్రతికిస్తోంది కమలాక్ష జై శ్రీ కృష్ణ
మేఘశ్యామలకోమలాంగ శతకోటిమన్మధాకార జగన్మోహనసౌందర్యాకార మురళీధర కృష్ణమురారి ఈ సృష్టి లో అద్వితీయమైన నీ సౌందర్యం నన్ను సన్మోహన పరుస్తుంది మాధవ కృష్ణ

  • శ్రీ రామచంద్ర రఘుకులతిలక రామ నిన్ను నీనేమని వర్ణించెదను నా తండ్రి రామయ్య వాల్మీకి ఋషులు జ్ఞానులు ఎంతో ధారణ శక్తి కలిగిన వారికీ సాద్యమైనంత నాకు సాద్యం కాదు దయాకర దాశరధి సీతాపతి అజ్ఞానపు చికట్లని దూరంచేయు జ్ఞానప్రదాత ధర్మానికి స్వరూపమై నిలిచిన ధర్మసిందు నిన్ను వర్ణించకుండా ఉండలేక నాకు సాద్యం కాకపోయినా నిన్ను వర్నించాను స్వామి రామప్రబు నీకు శరను శరణు జై జై శ్రీ రామచంద్ర నిను విడిచి ఉండలేనయ్యా నా రామయ్య తండ్రి
శ్రీరాఘవ దశరథప్రియతనయా శ్రీరామ నీ నామం ఎంత అద్బుతమయ్యా! "రామ" అన్న చాలు పాపరాసి దగ్దమైపోతుంది అటువంటి నీ అద్బుతనమాన్ని నిత్యం స్మరించువారి అదృష్టం అనిర్వచనీయమైనది భాగవతోత్తములైన నీ నామ స్మరనచేయు వారు పరమపావనులు పావననామ పరమ సుగుణ రామ
ఎదువంశకిశోర క్రిష్ణమురారి ఆనాడు పదహారువేలరాకుమారులను అపహరించిన నరకాసురుడితో యుద్దంచేసి వానినిసంహరిచిన మహానుబావ కృష్ణా చేతిలో ఉన్న దానస్సుని కూడా పక్కన పెట్టకుండా యుధం ముగియగానే వచ్చి పడతులందరినీ విడిపించుటకోరకు వచ్చితివి పరమాత్మా నిన్ను ఇలా చూస్తుంటే రావణుడిని నిహతున్ని చేసిన రాముడు స్మురణకి వస్తున్నాడు కేశవా కృష్ణ నిన్ను నమ్మి ఎదురు చేసేవారికై నీవు తపకవస్తావు కృష్ణ
సహస్రనామ శ్రీ శ్రీనివాస నీనామము నిత్యకల్యాణము నిత్యకల్యాణ చెక్రవర్తి హరి నారాయణ నీకు నిగనిగల కర్పూర నీరాజనం
ధన్యచరిత క్రిష్ణమురారి నీకు దాస్యమ్ము చేయని జన్మంయేలా అని రుక్మిణి దేవి నిన్ను ప్రదించినది కృష్ణా అటువంటి నీకు దాస్యం చేసే అదృష్టాన్ని నాకు కటాక్షించు ముకుందా జన్మలెన్ని యెత్తినా నీయందు భక్తి కలిగి ఉండేవిధంగా నన్ను అనుగ్రహిచు నారాయణ నందకిశోర
కృష్ణా నా ఊహాలో, నా ఆలోచనలో,నా కలలో,నా మాటలో,నా నీడలో, నా మనస్సులో ప్రతిచోటా నిన్నే దర్శించాలి అనుకుంటున్నాను జనార్ధన విశ్వ వ్యాప్త ఐయిననీవు నాకు అటువంటి వరాన్ని ప్రసాదించు ముకుందా జై శ్రీకృష్ణ
శ్రీకృష్ణ నీ నామము యెంతో మధురము రా , బృందావన చంద్ర శ్రీకృష్ణ నీ నామమంటే నా కేంతో ప్రాణము రా ఆనంద ముకుందా 
(కృష్ణ శబ్దము అర్ధము సర్వాకర్షణము నిరతిశయ ఆనంద స్వరూపమే కృష్ణ స్వరూపము ఆ ఆనంద కృష్ణ స్వరూపమే సర్వకర్షణము)
కృష్ణా ఎటువంటి మోహం, వ్యామోహానికి నా మనసు ఎప్పుడు లొంగిపోదు . నీటిలో మునిగి పోయే సైకత రేణువులులా నా మన్నస్సు ఎప్పుడు నీ పాదాలనే ఆశ్రయిస్తుంది
సత్వగునప్రదాన హరి నా కర్తవ్యము నిన్ను సేవించడము ఈ మానవజీవితంలో నీవే నాకు అండగా ఉండాలి నారాయణ విహిత ధర్మాన్ని ఆచరించే విదంగా నీవే నన్ను అనుగ్రహించాలి నన్ను తరింపచేయువడవు నీవుమత్రమే నీరజాక్ష నరధగానలోల
పరబ్రహ్మ శ్రీహరి నారాయణ కర్మలు లేని నీవు కర్మలను ఆచరిచుతావు ప్రబు రామవతరం లో మాకు మనుష్యుడిగా ధర్మాన్ని ఆచరించి మాకు నేర్పవు కౌసల్యానందన బ్రహ్మ నీ నాబి కమలమందు శ్రుజియించిన ఓ పద్మనాభ నీవు కృష్ణావతారం లో భక్తులు సద్ బ్రాహ్మణులు ఐయిన వారి పాదములు కడిగి మాకు ధర్మం నేర్పవు అయ్య కృష్ణ నీకు మాపై ఎంతటి కరున్యమయ్య మాకు దర్మం మంచినేర్పించుటకొరకు నీవు ఎంతకైనా దిగివస్తావు ప్రబు
స్వామి హనుమన్నా నీది ఎంతటి అద్వితీయమైన భక్తి రామయ్య పాదములను నిత్యం సేవించు నీ బాగ్యం వర్ణించుటకు అలవికానిది స్వామి హనుమన్నా అంతటి భక్తితో నా రామయ్యని సదా సేవించు మీకు శతకోటి ప్రణామములు స్వామి హనుమన్నా రామదూత స్వామి హనుమన్నకి జై "జై హనుమాన్"
రాజవరశేకర రవికులసుధాకర రామనారాయణ నీ కరకమలంలోని శరబానములను ప్రయోగించి నాలోని కల్మశములని సంహరించు కోదండపాని శ్రీ రామ నా మనసు నిలకడగా నిలబడేలా నన్ను అనుగ్రహించు నాకు సాత్వికమైన ప్రవర్తన కలిగేల కటాక్షించు కమలాక్ష ఆశ్రితపక్షపాత భక్తరక్షక
మోహన రూప సన్మోహనణాకార గోపాల ఊహాతీతం నీలీల కృష్ణమురారి నీనామ సుధా సాగరం లోనీ సుధ ఎంత త్రాగినా తనివి తీరదుకదయ్యా ముకుందా నీ నామ స్మరణ మాకు నిత్యమంగలప్రధము నిత్యకల్యాణము జై జై శ్రీ కృష్ణ
అన్నమాచార్యుల వారు తెలియచేసారు. ఏధాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు ఆది నారాయణుడి అఖిల రక్షకుడు. స్వామి నారాయణ తండ్రి మీరు సమస్తాన్ని రక్షిస్తూ ఉన్నపుడు మీరు రక్షకుడిగా ఉన్న ఈ ధరనిలో ఏజన్మ ఎత్తియే ఏమిటి ఎన్ని జన్మలెత్తితే ఏమిటి అని. హరి నారాయణ నాకు ఈజన్మకు మోక్షం ఇస్తావో ఇవ్వవో నీ సంకల్పం నాకు తెలియదు స్వామి అంతర్యామి మీరు నాకు ఎన్ని జన్మలు ప్రసాదించినా ఎటువంటి జన్మ ప్రసాదించినా అచ్యుతుడివైన నీ పాదముల యందు భక్తి నీ పై మనస్సు ఉండేలా నన్ను అనుగ్రహించు ప్రబు పరంధామ

హే గోవిందా వేణుగోపాల శికిపించమౌలి నీవు రేపల్లె లోకే రూపైనా మొనగాడివి అని విన్నాను ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను ఇంతటి జగన్మోహన సౌందర్యం కేవలం నీ ఒక్కడిదే కృష్ణా శ్రీహరి గోపాల
అన్నమాచార్యుల వారు తెలియచేసారు. ఏధాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు ఆది నారాయణుడి అఖిల రక్షకుడు. స్వామి నారాయణ తండ్రి మీరు సమస్తాన్ని రక్షిస్తూ ఉన్నపుడు మీరు రక్షకుడిగా ఉన్న ఈ ధరనిలో ఏజన్మ ఎత్తియే ఏమిటి ఎన్ని జన్మలెత్తితే ఏమిటి అని. హరి నారాయణ నాకు ఈజన్మకు మోక్షం ఇస్తావో ఇవ్వవో నీ సంకల్పం నాకు తెలియదు స్వామి అంతర్యామి మీరు నాకు ఎన్ని జన్మలు ప్రసాదించినా ఎటువంటి జన్మ ప్రసాదించినా అచ్యుతుడివైన నీ పాదముల యందు భక్తి నీ పై మనస్సు ఉండేలా నన్ను అనుగ్రహించు ప్రబు పరంధామ
కృష్ణా నిన్నే స్మరిస్తూ ఉంటాను నా జీవితం తరించడం కోసం జీవితం గడుపుతుంటాను కృష్ణా నిన్ను స్వప్నంలో నైన నిన్ను దర్శించటంకోసం
నల్లనయ్య కృష్ణ గోపాల నా మనసులోని భావ పరంపర నీ అనుగ్రహ ఫలితమే 
పరంధామ నవనీతచోర గోవింద నీ బావన సుధా ప్రవాహం లో ప్రయాణిస్తూ....... 
నీను నిన్ను చేరుకునేల వరాన్ని ప్రసదిచు పరమేశ్వర నీలదేహ
స్వామి నారాయణ ఒక్క నారాయణ అన్న నీ నామాన్ని స్మరించినంతమత్రమున దుర్లభమైన మోక్షాన్ని ప్రసాదిస్తావు పరమాత్మా నీ నామాన్ని తన కొడుకుకి పెట్టు కొని మరనించే సమయం లో కొడుకు మీది ప్రేమతో నారాయణ అంటూ మరణించిన క్రూరుడైన అజామీళుడు వంటి వారె మోక్షాన్ని పొందగలిగిన పరమపావనమైన నీ నారాయణ నామాన్ని నా నాలుకపై సదా పలికించు తండ్రి లక్ష్మీపతి శ్రీధర నారాయణ జై శ్రీమన్నారాయణ
కృష్ణా నీవు ఎక్కడున్నా నీ భక్తుల కంట తప్పక పడతావు కన్నయ్య నీది జగన్మోహన సౌందర్యం మొరలిధర
పరబ్రహ్మ పురుషోత్తమా హరి నీ నాబికమలము నందు బ్రహ్మశృష్టించబడ్డాడు అట్టి నీవు కృష్ణావతారం లో ఎశోదానందులకి తనయునిగా నంధవ్రయంలో గోపలబలుడిగా గోవులను కాస్తూ పెగిగావు యగబోక్త లక్ష్మీపతి అయిన నీవు గోపలబాలురతో అటలాడావు వారుఎంగిలి అన్నం పెడుతుంటే తిన్నావు స్వామి నారాయణ నీవు కృష్ణవతారం దాల్చి మాకు ఎంతో సులబుడివైనావు పరమేశ్వర హరి నీ అవతారములలో కృష్ణుడిగా నిన్ను పట్టుకోవడం మాకు ఎంతో తేలిక అందుకే కృష్ణుడిగా నీవు నాకు ఎంతో ఇష్టం కన్నయ్య
జన్మల తపమో ఎన్నిజన్మల పుణ్య పలమో వేనువై నిన్ను చేరిన వేదురుజన్మ ధన్యము కదా కృష్ణా
ఓ కృష్ణా నీను విన్నది ఏమనగా మురలీకృష్ణుని మోహన గీతికి పరవశమైనవి లోకములే అని అట్టి నీ మురళీ గానామృతం వినే బాగ్యాన్ని నాకు కల్పించవా కృష్ణా అట్టి నీ వేణువు పలికే మదురగీతాల లాలనలో నిదురించాలి
ఓ కృష్ణా నీ మనోహరమైన అద్బుతరూపం ఎంతచూసిన తనివితీరదు కధయ్యా గోపాల ఆనాడు నంధవ్రయం లోని వారు ఎంతటి బాగ్యవంతులు అంతటి బాగ్యాన్ని నీ భక్తులమైన మాకు కల్పించిన నీది ఎంతటి కారున్యామయ్య గోవిందా గోపాల మురారి మాధవా హరి మా ఇంట్లో నీను ప్రతిరోజు పూజించే నా కృష్ణుడు

గోపకిశోర గోపాల మా గోపీజనవల్లబుడివైన నీవు మమ్మల్ని ఇలా నీ ఎడబాటుతో నిరీక్షీంప చేసుట న్యాయమా గోవింద నీ రాకకై ఎదురు చూసే మా కన్నులకు కమనీయమైన నీ దర్శన బాగ్యాన్ని కలిపించవా మాధవా క్రిష్ణగోపాల నిత్యం నీ దివ్యమంగల స్వరూపాన్ని దర్శించే బాగ్యం మాకు ఎప్పుడుకలుగుతుందా అని ఎదురుచూస్తున్నాము ప్రబు మమ్మల్ని వేగమే అనుగ్రహించు హరి అచ్యుతకృష్ణ
స్వామి నారాయణ దివ్యమైన నిన్ను కీర్తించిన వారు దివ్యసురులు భక్తపక్షపతి వైన నీ భగవత్ భక్తి యొక్క లోతు చూసిన వారు ఆళ్వారులు అంతర్యామివైన నిన్ను ప్రస్తుతించి పేర్కొన్నట్టి శ్రీ వైష్ణవ దివ్యదేశములు 108 ఆ దివ్య దేశములని దర్శించాలి అని నా మనసులో కోరిక ఉంది ప్రబు నారధగానలోల శ్రీపతి కరునసముద్రుడివైన నీవు నన్ను అనుగ్రహించి దివ్యదేశముల దర్శనభాగ్యన్ని నాకు అనుగ్రహించు హరిఅచ్యుత 108 దివ్యదేశములలో రెండు దివ్యదేశములు (1.తిరుప్పర్ కడల్(క్షీరసాగరం), 2.తిరు పరమపదం(పరమపదం వైకుంటం లో వాసుదేవుడు))ఈ రెండు దివ్యదేశములను సహజనేత్రములతో దర్శించలేరు అష్టాంగ యోగములతో అంతర్ముకంగా దర్శించాలి మానవులకి అది సులబసద్యం కాదు దేవతలకు మహర్షులకు మాత్రమే సాద్యము అని నీను విన్నాను పరమాత్మా నీవు కృష్ణావతారం లో సత్పురుషుడైన విదురుని తో స్నేహంగా ఉన్నందువల్ల గ్రుడ్డివాడైన ధృతరాష్టునికి దివ్యనేత్రములని ప్రసాదించి నీ దివ్య విశ్వరూప సంధర్శనాన్ని కలిపించావు ప్రబు పరంధామ అష్టాంగ యోగములు అవేవి నాకు తెలియదు కేవలం నీ అనుగ్రహ విశేషం వల్లనే నీను పూర్తి 108 శ్రీవైష్ణవ దివ్యదేశములు దర్శించగలను స్వామి నారాయణ నాకు 108 దివ్యదేశముల దర్శనభాగ్యాన్ని కలిపించు ప్రబు పరమేశ్వర నీ కటాక్షంచే దివ్యజ్ఞానమును పొందిన ఆళ్వారులు కీర్తించిన ఆ దివ్యదేశములలో నీ దివ్య స్వరూపాన్ని నాకు దర్శిమ్పచేయి దన్యచెరిత
జగత్గురువైన కృష్ణ పరమాత్మా మీరు భగవద్గీత లో తెలియ చేసారు అంత్య కాలేచ మామేవ స్మరణ ముక్తా కళేబరం. (ఎవరైతే మరణించే సమయం లో నన్ను స్మరిస్తూ మరణిస్తారో వారు నన్నే చేరుతారు అని). కానీ కృష్ణా మరనిచే సమయం లోని వారు వారికి ఎవరైతే ప్రీతీ కరమో వారే స్మురణకు వస్తారు.వారు ఎవరినైతే సదా స్మరిస్తారో వారినే స్మరిస్తారు అని విన్నాను. పరాత్పరా స్వామి కృష్ణయ్య నీపైన నాకు పరిపుర్నమైన ప్రీతీ కలిగేల నన్ను అనుగ్రహించు పరమేశ్వర ధరాధరుడివైన నీ నామాన్నే నిత్యం స్మరించేల నన్ను అనుగ్రహించు అనంతా గోవింద కృష్ణ నా అంత్యకాలంలో నీనామాన్నే నా జిహ్వతో పలికించు అంతర్యామి వైన నీవే నా స్మురనయందు నిలిచి ఉండు ప్రబు పతితపావన గోపాల
రాజవరశేకర రవికులసుధాకర శ్రీరామచంద్ర స్వామి రామయ్య తండ్రి నీ కంటికరుణ సుధారసధారలని మా పై సదా కురిపించు ప్రబు రావికులప్రదీప రాఘవ
మోహన రూప సన్మోహనణాకార గోపాల ఊహాతీతం నీలీల కృష్ణమురారి నీనామ సుధా సాగరం లోనీ సుధ ఎంత త్రాగినా తనివి తీరదుకదయ్యా ముకుందా నీ నామ స్మరణ మాకు నిత్యమంగలప్రధము నిత్యకల్యాణము జై జై శ్రీ కృష్ణ
కృష్ణా నిన్ను నీను మనస్సున తలచినప్పుడు నిలిమబ్బులు మేరయునప్పుడు కృష్ణా నీను నీ గొపికనౌదు కృష్ణ నీను నీ రధనౌదు కృష్ణా నేనునీ రాధనోయి కృష్ణా నీనే నీ రధనోయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి